అరుదైన ఏ నెగటివ్ బ్లడ్ రక్తదానం చేసిన రక్తదాతలు..
సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి) జూలై 31:హుజూర్ నగర్ పట్టణంలోని సింధు హస్పటల్ లో నేరేడుచర్ల కి చెందిన నకిరేకంటి ప్రసాద్ అనే వ్యక్తి కి సర్జరీ నిమ్మితం రెండు యూనిట్ల ఏ నెగటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నగేష్ జనచైతన్య ట్రస్ట్ సభ్యులకి తెలియచేయడంతో వెంటనే ట్రస్ట్ సభ్యులు స్పందించి ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ లు అనిల్ మరియు సీతారాంపురం కి చెందిన రాజు లతో మాట్లాడి రెండు యూనిట్ల ఏ నెగటివ్ బ్లడ్ రక్తదానం చేపించడం జరిగింది.

ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రక్తదానం సామాజిక బాధ్యత,ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటే రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయస్థితిలో ఉన్న వారినీ కాపాడుకోవచ్చు, కష్టాల్లో ఉన్న వారిని కాపాడుకోవడం మనిషి కనీస ధర్మం. ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి రక్తదానం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు,హుజూర్ నగర్ మరియు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మేము రక్తదానం చేస్తూ, చేపిస్తూ ముందుకు సాగుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పారా సాయి, పిల్లి శివశంకర్, దగ్గుపాటి రమేష్, నవీన్, కాశి విశ్వనాధ్, కె సాయి, జయంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.
About The Author
02 Aug 2025