కాకతీయ గడ్డ నుండే బీసీల రిజర్వేషన్ల ఉద్యమం

జాజుల శ్రీనివాస్ గౌడ్ , జాతీయ అధ్యక్షులు -
జాతీయ బలహీన తరగతుల సంక్షేమ సంఘం 

WhatsApp Image 2025-08-01 at 6.25.26 PMబీసీలకు 42శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటే కాకతీయ గడ్డ నుండే  తెలంగాణ తరహాలో బీజేపీ పై ఉద్యమం చేయాల్సి వస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.ఈ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో బీసీ మేధావులు ఏర్పాటు చేసిన సదస్సులో బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసి పాల్గొనుటకు ముందుగా  దూరవిద్య కేంద్రం ప్రాంగణంలోని ఫూలే దంపతులకు పూల మాల వేసి,అనంతరం సభలో మాట్లాడుచూ ఎప్పుడో 1931లో చేసిన కులగణనతో విద్య,ఉద్యోగ,రాజకీయ అవకాశాల్లో ఓబీసీలకు నష్టం జరిగిందని,ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాదిరిగా కులగణన చేసిందని,42శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్ళితే పుట్టగతులు ఉండయని ఏఐసీసీ కార్యాలయం ముట్టడించడం మూలాన దిగివచ్చి శాసనసభలో తీర్మానం చేసి పంపితే బీజేపీ మూడునెలలుగా ఆమోదించకుండా ముడ్డికింద పెట్టుకొని రాష్ట్రంలో ధర్నా చేస్తామని తొండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు.మండల్ కమిషన్ నుండి నేటి రిజర్వేషన్ల అమలు వరకు బీసీలకు  వ్యతిరేకంగా పని చేస్తుందని,ముస్లింల పేరుతో బడుగులకు మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, దేశంలో పార్లమెంట్ అత్యున్నత సభ అయినప్పుడు సవరణ చేసుకునే అధికారం మీకు ఉంది కదా? ఈ డబ్ల్యూఎస్  లో లేని ముస్లిం లొల్లి కేవలం బీసీల రిజర్వేషన్లకు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు.ఇదేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ సైతం రాజ్ భవన్ లో ఆమోదానికి నోచుకోక పోవడానికి బీజేపీ అసంబద్ధ వైఖరే కారణమని,కనీసం ప్లోర్ లీడర్ పదవి కూడా ఇవ్వకుండా బీసీలపై ధర్నా పేరుతో కపట ప్రేమ నాటకం 60శాతం ప్రజలు గమనిస్తున్నారని,2028 ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెడుతారని హెచ్చరించారు.ఇక బీఆర్ఎస్ వైఖరి నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు 8వతేది కరీంనగర్ బీసీల శంఖారావం పేరుతో దగా చేయడానికి ముందుకు వస్తుందని, అయితే దశాబ్దం కాలంపాటు అధికారంలో ఉండి స్థానిక సంస్థల్లో 34శాతం ఉన్న రిజర్వేషన్లు 18 శాతంకు తగ్గించిన ఘనత కేసీఆర్ ది  కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన బీసీల కులగణనలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం మరోమారు నయవంచనకు గురి చేయడానికి బయలుదేరిందని బీసీలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సమావేశ అధ్యక్షులు బీసీ యూనిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెలమల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో నిక్షిప్తంగా ఉన్న ప్రాతినిధ్య ,ప్రజాస్వామ్యంలో  సమానత్వం, సామాజిక న్యాయం కోసం విస్తృత చర్చలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించే విధంగా బిసి భావజాల వ్యాప్తికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 

Read More దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమైనది..


ఈ సమావేశ కోఆర్డినేటర్ ,ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ బీసీలను ఓట్లకోసం కాకుండా రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేసేందుకు మూడు పార్టీలు కృషిచేయాలని హితవుపలికారు.దశాబ్దంగా కులగణన చేయకుండా జాప్యం చేసిన కేంద్ర ప్రభుత్వం,కాంగ్రెస్ కులగణన రాజ్యాంగబద్దంగా లేదని మాట్లాడడం బీజేపీ దివాళాకోరుతనానికీ పరాకాష్ట అన్నారు.ఆర్డినెన్స్ తెచ్చిన రోజు రంగులు పూసుకున్న కేసీఆర్ తనయ రిజర్వేషన్లు తగ్గించిన నాడు నోరుమెదపలేదని దుయ్యపట్టారు. 

Read More శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నాగ పంచమి పూజలు..

తెలంగాణ ఉద్యమ కారుల రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాటలాడుచూ బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదని,దాని కోసం బీసీ ఐక్య ఉద్యమాలు అవసరం అన్నారు. 

Read More వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్


ఈ నేపథ్యంలో, సంఘాలు ఈ “ప్రతినిధి నివేదనను తీర్మానాలతో కలిపి” భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి వినమ్రంగా సమర్పించేందుకు సభ తీర్మానం చేసింది.నివేదనలో 2025 సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో వెనుకబడిన తరగతుల (బీసీలు) కోసం విద్య, ఉపాధి  రాజకీయ ప్రాతినిధ్యం రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 2025లో తెలంగాణ శాసనసభ ఆమోదించిన తీర్మానానికి రాష్ట్రపతి  ఆమోదం మంజూరు చేయాలని,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం విద్యా , ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,2. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాలను రక్షించేందుకు తమిళనాడు నమూనాలోనూ రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని.తీర్మాణం చేయడం జరిగింది ఈ అత్యంత కీలకమైన అంశాలను  పట్టించుకుని, భారత రాజ్యాంగంలో నిక్షిప్తంగా ఉన్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విలువలను రక్షించేందుకు అవసరమైన శాసన, పరిపాలనా చర్యలు తక్షణమే ప్రారంభించాలని సభ వినయపూర్వకంగా కోరింది. 

Read More ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..

ఈ కార్య క్రమంలో రిటైర్డ్ ఆచర్యల సంఘం ప్రధాన కార్యదర్శి ఆచార్య వడ్డె రవీందర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బైరి రవి కృష్ణ, పాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య,పాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ,జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, పాస్ నాయకులు డాక్టర్ నల్లాని శ్రీనివాస్, బాబు యాదవ్ ,బీసీ జాక్ నాయకులు డాక్టర్ తిరుణహరి శేషు,ఆచార్య విజయ బాబు, ఆచార్య కట్ల రాజేందర్ డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ రాధికా రాణి, డాక్టర్ సుజాత, డాక్టర్ గడ్డం కృష్ణ,డాక్టర్ నాగయ్య,డాక్టర్ బ్రహ్మయ్య,అరగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

About The Author