నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటలను సాగు చేయాలి.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 29: ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకొని, రైతులు నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటను సాగు చేయాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పిల్లలు మర్రి, బాలేంల, ఎర్కారం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటల సాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పంటలను పండించాలన్నారు.

About The Author
02 Aug 2025