బొమ్మరిల్లు కాలనీలో వనమహోత్సవం సందర్భంగా 150 మొక్కలు నాటిన స్థానికులు.

WhatsApp Image 2025-08-01 at 6.56.40 PMనిర్మల్ పట్టణంలోని బొమ్మరిల్లు కాలనీలో వనమహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానికులు పలు రకాల మొక్కలను నాటారు. కాలనీ అధ్యక్షుడు పోచయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి రిదాన్ సాయి, భూషణ్, రవీందర్ రెడ్డి, సంపత్ కుమారులు తదితరులు చురుకుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమారు 150 మొక్కలు నాటారు. కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం సాగింది. స్థానికులు ఈ తరహా కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని సంకల్పించారు.

Read More గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 

About The Author