హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి )జూలై 30:డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) హుజూర్ నగర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎస్టీ బాలురు హాస్టల్‌ను సందర్శించి హాస్టల్‌లోని విద్యార్థుల స్థితిగతులను సమీక్షించి, వారికి ఎదురవుతున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మీసాల వీరబాబు మాట్లాడుతూ హాస్టల్‌లో ఉన్న వసతుల పరిస్థితి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, అధ్యయన వాతావరణం వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా విద్యార్థుల అభ్యున్నతే దేశ భవిష్యత్తు. హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఇందిరాల నరేష్,
సమాజ్ కమిటీ సభ్యులు శంకర్, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025