పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై31:పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కమీషనర్ హన్మంతరెడ్డి అన్నారు.వన మహోత్సవం ,100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా,గురువారం సూర్యాపేట స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో ఆయన గురుకుల సొసైటీ ఫిఫ్త్ జోన్ జోనల్ ఆఫీసర్  ఎస్. విద్యా రాణి,విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలంటూ సూచించారు.ఇప్పటి తరం విద్యార్థులు భవిష్యత్‌ పర్యావరణ రక్షకులు కావాలన్నారు.వన మహోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు కోసం విద్యార్థులు మొక్కలు నాటాలని కోరారు.విద్యార్థుల ఉత్సాహం,మొక్కలతో  క్యాంపస్‌ కళకళలాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జీవి విద్యాసాగర్, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టిపీఓ సోమయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, నర్సరీ ఇంచార్జ్ వసుంధర,ఉప ప్రిన్సిపల్  బి.యాదయ్య, జి. రమేష్, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, నరేష్, కృష్ణారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. 
 
 

About The Author