గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 

WhatsApp Image 2025-08-01 at 7.37.55 PMసంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు గ్రూప్స్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి మరియు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లకు ఉచిత ఫౌండేషన్ కోర్సు ప్రోగ్రాం ఆగస్టు  25 నుండి 150 రోజులపాటు బీసీ స్టడీస్ సర్కిల్ సంగారెడ్డి నందు నిర్వహిస్తున్నారని సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, తల్లిదండ్రుల వార్షికోదాయము గ్రామీణ ప్రాంతంలో 1,50,000 పట్టణ ప్రాంతంలో రెండు లక్షల లోపు ఉన్నవారికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిగ్రీలో వచ్చిన అది అత్యధిక మార్కులు మరియు రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఎంపిక జరుగుతుందని కోచింగ్కు ఎంపికైన అభ్యర్థులు విధిగా 75% హాజరు శాతం కలిగిన వారికి నెలకు ₹1000 చొప్పున ఐదు నెలలు స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు. బిసి, ఎస్సీ, ఎస్టీ ఈ బీసీ అభ్యర్థులుwww.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 08455 - 277 015, 9494390803, లేదా బిసి స్టడీ సర్కిల్ కార్యాలయం వెలుగు ఆఫీస్ క్యాంపస్ బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు ఆఫీస్ వేళలో నేరుగా సంప్రదించగలరని తెలిపారు.

About The Author