సూర్యాపేట, కోదాడకు రెగ్యులర్ ఎ ఎల్ ఓ లను కేటాయించాలి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 31:సూర్యాపేట జిల్లాలో రెగ్యులర్ ఏఎల్ఓ లను సూర్యాపేట,కోదాడకు కేటాయించాలని, భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైములను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, లేబర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి కి తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం(ఐ ఎఫ్ టి యు) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర,జిల్లా ప్రధాన కార్యదర్శిలు గంట నాగయ్య,దేశోజు మధు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మికుల క్లైములు అనేకం పెండింగ్ లో ఉన్నాయని, వీటిని పరిష్కరించడంలో రెగ్యులర్ ఎ ఎల్ ఓ లు లేకపోవడంతో ఆలస్యం అవుతుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర లేబర్ అధికారులు రెగ్యులర్ ఏ ఎల్ వోను కేటాయించాలని కోరారు.2020 నుండి భవన నిర్మాణ కార్మికులు వివిధ క్లైముల కోసం అప్లై చేసుకున్నారు.అప్లై చేసుకొని సంవత్సరాలు కావొస్తున్న వాటిని పరిష్కరించడంలో ఆలస్యం అవుతుంది,
దీనితో కార్మికులు డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురుచూస్తున్నారు. అనేకమంది వీటిపై సరిగా అవగాహన లేక లేబర్ ఆఫీసు కు రాలేక క్లైమ్ స్టేటస్ ను కూడా తెలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దిష్టంగా సూర్యాపేట జిల్లాలో ఎన్ని క్లైములు పెండింగ్ లో ఉన్నావో వాటిని గుర్తించి ఆ వివరాలను ఆ ఆఫీసుల ముందు ప్రదర్శించాలి, కార్మికులకు తెలియజేయాలి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నాము. పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కొత్త లేబర్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి వారి కార్డులలో ఫోటోలు రావడం లేదు. క్లైములు అప్లై చేసుకున్న స్టేటస్ లో చూపించడం లేదు. బోర్డుకు నోడల్ ఆఫీసర్లు క్లెయిమ్ లను ఫార్వర్డ్ చేసి నెలలు కావస్తున్న వర్కర్ ఖాతాలో అమౌంటు జమ కావడం లేదు. డిస్పాచ్డ్ అని చూయిస్తున్నవి. బోర్డుకు పంపిన క్లైమ్ లను తిరిగి సెంట్ బ్యాక్ చేస్తున్నారు. కార్మికులు ఇన్ టైం లో రెన్యువల్ చేసుకోకపోవడంతో కార్డ్స్ లాప్స్ అవుతున్నవి. కొత్త కార్డుకు అప్లై చేసుకుందామన్న, రెన్యువల్ చేసుకోవాలన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ విధంగా అనేక సమస్యలను కార్మికులు ఎదుర్కొంటున్నారు దీనితో వర్కర్స్ లేబర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అనేక గందరగోళాలకు గురవుతున్నారు. తక్షణమే పై సమస్యలను పరిష్కరించడానికి సూర్యాపేట జిల్లాలో రెగ్యులర్ ఏ ఎల్ వో లు లేకపోవడంతో సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆలస్యం అవుతుంది. అనేక క్రైమ్ లు కూడా పెండింగ్ లో ఉంటున్నవి. రెగ్యులర్ ఏ ఎల్ ఓ లను కేటాయించడం వలన సత్వరమే సమస్యలు పరిష్కారం రావడానికి అవకాశం ఉన్నది. కావున పై సమస్యల పరిష్కారానికి లేపరాధికారులు చర్ల చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డి. సైదులు, పురుషోత్తం, కళ్యాణ్, నాగరాజు, లింగమల్లు పి డి ఎస్ యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పాల్గొన్నారు .

About The Author
02 Aug 2025