ముఖ గుర్తింపు తో పెన్షన్ ఇవ్వడం వల్ల అక్రమాలకు చెక్.
సంగారెడ్డి (భారత శక్తి ప్రతినిధి)జూలై 30:ముఖ గుర్తింపు యాప్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళ లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను,, ముఖ గుర్తింపు ప్రత్యేక ఆప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ ముఖ గుర్తింపు యాప్ తో పెన్షన్లు ఇవ్వడం వల్ల వృద్దులు, వేలిముద్రలు రాని వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో చేయూత పథకం వలన ప్రతి నెలా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్ లు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారా నూతనంగా ప్రభుత్వం రూపొందించిన ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా కొత్త విధానంలోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.ఎక్కడైనా సాంకేతిక సమస్యలు అప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డి ఆర్ డి ఓ సూర్య రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.