ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం..

కామారెడ్డి (భారత శక్తి ప్రతినిధి)  జులై 31: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం అమలు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు.
1000003160
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి గ్రామ పంచాయతీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు నీటి సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు నీటి తాకిడి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే  ప్రతి ఒక్క అధికారితో ప్రత్యేకంగా చర్చిస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో తమ పాత్రను బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు.ఈ సమావేశంలో ఆర్డీవో, డీఎల్పీఓ, ఎంసీపీడీఓ, (ఈఈ), ఎమ్మార్వోలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ), పంచాయతీ సెక్రటరీలు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 
 
 
 
 
 

About The Author