కబ్జాకోరుల గుండెల్లో 'హైడ్రా' వణుకు!

  • ​ఒకవైపు బుల్డోజర్ల గర్జన.. మరోవైపు క్షేత్రస్థాయిలో కమిషనర్ వార్నింగ్
  • బంజారా లేక్ కాలుష్యంపై సీరియస్.. మామిడిపల్లి కుంటల ఆక్రమణపై ఆరా
  • న్యూ బోయిగూడలో దారిని మూసేసిన అక్రమ కట్టడం నేలమట్టం.

కబ్జాకోరుల గుండెల్లో 'హైడ్రా' వణుకు!

హైదరాబాద్:

చెరువులను మింగేస్తున్న భూబకాసురులు, సామాన్యుల దారిని అడ్డం పెట్టుకుని ఇళ్లు కడుతున్న అక్రమార్కులపై 'హైడ్రా' పంజా విసిరింది. "ప్రభుత్వ భూమి అన్నా, చెరువు శిఖం అన్నా మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారా?" అన్న రేంజ్‌లో హైడ్రా తన యాక్షన్‌ను ముమ్మరం చేసింది. బుధవారం అటు కూల్చివేతలతో, ఇటు క్షేత్రస్థాయి తనిఖీలతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

​'బంజారా లేక్' మురుగు కూపం కావాల్సిందేనా?

​ఒకప్పుడు విదేశీ పక్షులకు నిలయంగా, స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని 'బంజారా లేక్' (బంజారా చెరువు) పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానికులతో కలిసి కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు.

​హోటల్ వ్యర్థాల అడ్డా: చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో అడ్డగోలుగా రోడ్డు వేయడం, హోటల్ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోయడంపై కమిషనర్ నిప్పులు చెరిగారు.

​గుడి దారిపై 'తాజ్' పెత్తనం?: ప్రసిద్ధ కట్టమైసమ్మ గుడికి వెళ్లే దారిని తాజ్ బంజారా యాజమాన్యం తమ ఆధీనంలోకి తీసుకుని భక్తులను ఇబ్బంది పెడుతోందని స్థానికులు మొరపెట్టుకున్నారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

​పార్కుగా మారుస్తాం: చెరువు పైభాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడి, ప్రజలకు ఉపయోగపడేలా పార్కుగా మార్చేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని హైడ్రా బాస్ స్పష్టం చేశారు.

​మామిడిపల్లిలో నాలుగు కుంటలు మాయం!
​శంషాబాద్ మండలం మామిడిపల్లిలో భూబకాసురుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 'ప్రజావాణి'లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఒంగోని కుంట, కనకయ్యకుంట, మర్రివాణికుంట, ఎర్రకుంట వంటి జలవనరులు ఆక్రమణకు గురై ఉనికి కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

​"వరద కాలువలను మూసేసి వెంచర్లు వేయడం వల్లే కాలనీలు మునుగుతున్నాయి.
 ఆక్రమణదారులు మర్యాదగా తప్పుకోకపోతే.. హైడ్రా డైరెక్ట్ యాక్షన్ (కూల్చివేతలు) మొదలుపెడుతుంది" అని రంగనాథ్ హెచ్చరించారు.WhatsApp Image 2026-04-08 at 19.48.22 (1)WhatsApp Image 2026-04-08 at 19.48.22 (1)

About The Author