డీసీఎం డ్రైవర్ అదృశ్యం… కుటుంబ సభ్యుల ఆందోళన

డీసీఎం డ్రైవర్ అదృశ్యం… కుటుంబ సభ్యుల ఆందోళన

ఎల్బీనగర్:

డీసీఎం వాహనంతో పుచ్చకాయలు అమ్మేందుకు వచ్చి డ్రైవర్ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జాన్ అందించిన వివరాల ప్రకారం…
కామారెడ్డి జిల్లా లింగపేట్ మండలం మంగరం గ్రామానికి చెందిన కొమ్ముల రవి యాదవ్ (37), తండ్రి మల్లయ్య, వృత్తి డ్రైవర్. జీవనోపాధి కోసం డీసీఎం వాహనంలో పుచ్చకాయలు తీసుకుని తన గ్రామస్తులతో కలిసి ఈ నెల 3వ తేదీన నాగోల్ ప్రాంతానికి వచ్చాడు.అల్కాపురి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో డీసీఎంను నిలిపి పుచ్చకాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల 6వ తేదీన అక్కడి నుండి వెళ్లిన రవి యాదవ్ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాగోల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యమైన రవి యాదవ్ గురించి ఎవరికి అయినా సమాచారం తెలిసిన పక్షంలో సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.

About The Author