అక్రమ నిర్మాణంపై 'సీజింగ్‌' వేటు...అధికారుల అవినీతిపై ఏది 'పోటు'?

  • భారత శక్తి కథనానికి స్పందన*
  • *సీజింగ్లు : ఓపెనింగ్లు,చీకటి భాగోతాలు: ఇదే అదునుగా గల్లీకో అక్రమ నిర్మాణం*
  • *అక్రమ నిర్మాణాలు సీజింగ్లు కాదు కూల్చివేత లే కరెక్ట్..!*
  • *అక్రమ పద్ధతిలో పర్మిషన్లు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారిపై చర్యలు ఎక్కడ..?*
  • *బిల్డ్ నౌ వెబ్సైట్లో పారదర్శకత లోపం , అవినీతికి ఆజ్యం పోసినట్లే: మున్సిపల్ ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి* దృష్టి సారించాలి..!*

అక్రమ నిర్మాణంపై 'సీజింగ్‌' వేటు...అధికారుల అవినీతిపై ఏది 'పోటు'?

సరూర్ నగర్:

చట్టాన్ని చుట్టేసి.. నిబంధనలను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చి.. సామాన్యుల భద్రతను పణంగా పెట్టిన ‘అక్రమ’ సామ్రాజ్యంపై ఎట్టకేలకు మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. కొత్తపేట హుడా కాలనీలో ‘బిల్ నౌ’ వ్యవస్థలోని లొసుగులను, పారదర్శకత లోపాన్ని ఆసరాగా చేసుకుని వెలసిన భారీ అక్రమ కట్టడాన్ని బుధవారం ఎల్బీనగర్ జోనల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. ‘భారత శక్తి’ పత్రిక ప్రచురించిన కథనంతో యంత్రాంగం కదిలినప్పటికీ, కేవలం భవనాన్ని సీజ్ చేయడంతోనే సరిపెట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు అనుమతులకు సహకరించి, ఖజానాకు గండికొట్టిన అధికారుల సంగతేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.IMG-20260408-WA0002IMG-20260405-WA0024

 **ఒకే స్థలం.. రెండు పర్మిషన్లు: 'బిల్ నౌ'కు పట్టిన గ్రహణం!*

హుడా కాలనీ ప్లాట్ నం. 39లో ఫైల్ నంబర్లు: 
1):010392/GHMC/03322/IABP/C5/2025 

2): 010390/GHMC/03321/IABP/C5/2025) రెండు వేర్వేరు అనుమతులు పొంది, వాటిని అక్రమంగా విలీనం (Clubbing) చేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

సామాన్యులు నిర్మాణం నిర్మించాలంటే ప్రాథమికంగా అనుమతులు తీసుకోవాలంటే "బిల్డ్ నౌ "వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అర్జీ పెట్టుకుంటే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉన్నత అధికారుల కు అప్లికేషన్ ను ఫార్వర్డ్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా, తదుపరి ఉన్నత స్థాయి డిప్యూటీ కమిషనర్, ఏసిపి, సిపి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు సైట్ విజిట్ చేసి అనుమతులు ఇవ్వాలి.. ఈ అనుమతులు ఇవ్వడం అక్రమమని తెలుసు, క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎన్ని ముడుపులు చేతులు మారాయి అనే విషయాన్ని ఎవరు బయట పెట్టాలి..? దీనికి సమాధానం చెప్పాలి..

సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ (బిల్ నౌ) విధానాన్ని అధికారులు కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మార్చుకున్నారు. ప్లాట్ నంబర్ 39లో నివాస గృహాల పేరుతో రెండు వేర్వేరు అనుమతులు పొంది, వాటిని అక్రమంగా కలిపేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా కూడా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ‘అదృశ్య హస్తం’ ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టకుండానే ఏసీ గదుల్లో కూర్చుని అనుమతులు మంజూరు చేయడంపై జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది.IMG-20260405-WA0025

**ఖజానాకు గండి.. భద్రతకు తిలోదకాలు*

వాణిజ్య సముదాయం నిర్మిస్తే మున్సిపల్ ఖజానాకు లక్షల్లో పన్ను ఆదాయం వస్తుంది. కానీ, నివాస గృహాల పేరుతో అనుమతులు పొందడం వల్ల ప్రభుత్వానికి భారీగా గండి పడింది. దీనికి తోడు:
  *ఫైర్ సేఫ్టీ మృగ్యం:*
కనీస సెట్ బ్యాక్ లు వదలకుండా, అగ్నిమాపక యంత్రం కూడా వెళ్ళలేని రీతిలో నిర్మాణం సాగించడం అత్యంత ప్రమాదకరం.

 * **సెల్లార్ల దందా:* 

నివాస అనుమతితో రహస్యంగా సెల్లార్ తవ్వేసి వాణిజ్య అవసరాలకు మళ్లించడం బిల్డర్ల తెగింపునకు పరాకాష్ట.

  అవినీతి ‘బైపాస్’: 

టీపీఎస్ నుంచి జోనల్ కమిషనర్ వరకు రాతపూర్వక ఫిర్యాదులు చేసినా నెలల తరబడి మౌనం వహించడం వెనుక ‘నోట్ల కట్టల’ మత్తు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

**సీజింగ్‌లతో సరిపెడితే సరిపోదు!*

కేవలం వార్తా కథనాలు వచ్చినప్పుడు సీజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా పనులు సాగనివ్వడం మున్సిపల్ శాఖలో ‘మామూలే’ అనే విమర్శ ఉంది. ఈ ‘తూతూ మంత్రపు’ చర్యల వల్ల ఉపయోగం లేదని బాధితులు పేర్కొంటున్నారు.

 1. **క్రిమినల్ కేసులు:*
 
తప్పుడు పత్రాలు సమర్పించిన బిల్డర్‌పై, సహకరించిన ఆర్కిటెక్ట్‌పై ఐపీసీ 420 కింద కేసులు నమోదు చేయాలి.

 2. *లైసెన్సుల రద్దు:*

అక్రమ ప్లాన్లకు సహకరించిన టెక్నికల్ పర్సన్ల లైసెన్సులను బ్లాక్ లిస్టులో పెట్టాలి.

 3. *ఏసీబీ విచారణ:*

 అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై ఏసీబీ విచారణ జరిపి, వారి అక్రమ ఆస్తులను వెలికితీయాలి.

 **ప్రభుత్వంపై పెరిగిన బాధ్యత*

బిల్డ్ నౌ అధికారులు , దేవేందర్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ గారు, బిల్డ్ నౌ ట్రాన్స్ఫరెన్సీ లేకపోవడం.. టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ నిజాయితీగా ఉండే ప్రభుత్వ అధికారులకు మచ్చ తెస్తున్నారు.. అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి రుజువైతే కఠినమైన చర్యలు ఎక్కడ అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు...బిల్డ్ నౌ పబ్లిక్ పోర్టల్ని, వెబ్సైట్ ని, పారదర్శకతకు తాళం వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ   చేస్తున్నట్లే అవుతుందని గుర్తించాలి ..! 

*అక్రమ నిర్మాణాలు సీజింగ్లు కాదు కూల్చివేత లే కరెక్ట్..!*

నగరంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల పట్ల అధికార యంత్రాంగం ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలి. కేవలం నోటీసులు ఇచ్చి, భవనాలను సీజ్ చేసి వదిలేయడం వల్ల ఆక్రమణదారులు కోర్టుల నుండి స్టే తెచ్చుకుని పనులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, అక్రమ కట్టడాలను కేవలం సీజ్ చేయడమే కాకుండా, వాటిని తక్షణమే కూల్చివేయాలని (Demolition) ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. కానీ ఎల్బీనగర్ మున్సిపాలిటీలో ఆచరణ కరువైంది.. భవిష్యత్తులో సీజింగ్ ఓపెన్ అయి ..ఇదే అక్రమ నిర్మాణం సక్రమ నిర్మాణంగా కొనసాగి హాస్పిటల్ ఇతరత్రా వాణిజ్య సముదాయం నిర్వహించి అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ దృష్టి సారించాలి..!


 *హైడ్రాదృష్టి సాధించాలి..!*

హైడ్రా చొరవతో నగరంలో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం, ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం భవనం సీజింగ్‌తో చేతులు దులుపుకోకుండా, ఈ అవినీతి వ్యవస్థకు కారకులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మరి మున్సిపల్ కమిషనర్, సీసీపీలు ఈ అక్రమ ‘బైపాస్’ రోడ్డుకు శాశ్వత చెక్ పెడతారో లేదో వేచి చూడాలి.IMG-20260408-WA0003

About The Author