ఉమేష్ గౌడ్ చిత్రపటానికి మధుయాష్కి నివాళి
ఎల్బీనగర్ :
సాహెబ్‌నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాదాసు ఉమేష్ గౌడ్ దశదినకర్మ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమేష్ గౌడ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్, చంపాపేట డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు పాల్గొన్నారు. అలాగే కర్మాన్‌ఘాట్ దేవాలయ డైరెక్టర్ కంచర్ల కవిత, నాయకులు బండిగారి అశోక్ గౌడ్, పర్వతి గణేష్ రెడ్డి, కొత్త శ్రీధర్ గౌడ్, కొప్పుల వెంకటరెడ్డి, సుమన్ గౌడ్, పోచబోయిన సురేష్ యాదవ్, మణిశ్రీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
