
కామారెడ్డి జిల్లా :
నస్రుల్లబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ గ్రామంలో నేషనల్ హైవే – 765D రోడ్డు విస్తరణ పనుల ప్రభావం వల్ల తొలగించాల్సిన డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం పునఃస్థాపన విషయమై మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యు విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విట్టల్ , తహసీల్దార్ నస్రుల్లాబాద్ కె. సువర్ణ, మాజీ సర్పంచ్ రాము, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రాజు, గ్రామ పెద్దలు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో రోడ్డు విస్తరణ కారణంగా విగ్రహం తొలగించాల్సిన పరిస్థితులు వివరించగా గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గ్రామంలో విగ్రహం పునఃస్థాపనకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గుర్తించి, అధికారులు గ్రామ పెద్దలతో చర్చించి అంబేడ్కర్ విగ్రహాన్ని గౌరవప్రదంగా కొత్త స్థలంలో ప్రతిష్ఠించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరించనున్నట్లు హామీ ఇచ్చారు. అధికారులు సమన్వయంతో విగ్రహ పునఃస్థాపన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.