ప్రతిభ విద్యానికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో ని ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్ లో శనివారం సాంప్రదాయ పూల పండుగ బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను అందంగా అలంకరించి ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలను ఆనందభరితంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి చరిత్ర వారసత్వానికి ప్రతీకలన్నారు. ప్రతిభా పాఠశాలో విద్యార్థులునిర్వహించిన బతుకమ్మ సంబరాలు పలువురుని విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
