భైంసా మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు(ఎఫ్‌ఏసీ)గా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:
భైంసా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల ఫిర్యాదులు మరియు 2025 సెప్టెంబర్ 12న జరిగిన సమ్మె అనంతరం మున్సిపల్ కౌన్సిల్ పనితీరుపై విచారణ చేపట్టగా, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. భైంసా మున్సిపల్ కమిషనర్ (ఎఫ్‌ఏసీ)గా ఉన్న భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ఆదేశాల మేరకు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది విజయ్, అన్సార్, సలీం, ఆరిఫ్‌తో పాటు అర్షద్ బేగ్ (అమీర్), జావాన్‌లను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించారు. విచారణలో ఈ వ్యక్తులు ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడి నుంచి రూ.2,500 చొప్పున అక్రమంగా వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయమై ఉత్తర్వుల ప్రతులను సమాచారం కోసం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు మరియు అదనపు కలెక్టర్ (ఎల్‌బీ) నిర్మల్ ఫైజాన్ అహ్మద్‌కు పంపించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం మరియు బీసీ, మైనారిటీ సంక్షేమ సంఘం భైంసాకు అవసరమైన చర్యలు చేపట్టి అమలు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

