బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ వైన్స్ షాప్ వద్ద ఉద్రిక్తత

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ వైన్స్ షాప్ వద్ద ఉద్రిక్తత

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాప్ వద్ద మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. వైన్స్ నుంచి కొనుగోలు చేసిన బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో అవక్కాయ్యారు.బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ రావడంపై వినియోగదారులు వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దీంతో వినియోగదారులు, వైన్స్ నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కల్తీ మద్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత వైన్స్ షాప్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు.సమాచారం అందుకున్న మిరుదొడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదును స్వీకరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల జోక్యంతో ఆందోళన విరమించుకుంది.WhatsApp Image 2026-05-19 at 20.19.25 (1)WhatsApp Image 2026-05-19 at 20.19.25

About The Author