నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఒక లక్ష 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పంపిణీ
పటాన్‌చెరు:
ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
రామచంద్రాపురం ఎస్ ఎన్ కాలనీకి చెందిన నగారిగారి మరియమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన ఒక లక్ష 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాలను శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరంబండ కౌన్సిలర్ అంతి రెడ్డి పాల్గొన్నారు
About The Author
09 May 2026
