#Draft: Add Your Title
- ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి..
- క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే దొరకడం అదృష్టం..
- సినీ నటుడు సుమన్..
- పటాన్చెరులో అట్టహాసంగా ముగిసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు..
- విజేతలకు సినీ నటుడు సుమన్ తో కలిసి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్‌చెరు:
ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థినిలు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని.. దీని ద్వారా మానసిక ప్రశాంతత.. శారీరక ధారుడ్యత లభిస్తుందని సినీ నటుడు సుమన్ అన్నారు.
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో.. లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక పదవ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు..jpeg)
ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రంగా నిలవడం సంతోషకరమని అన్నారు.

