బీసీ ప్రభంజనం సభకు ముఖ్యఅతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య

బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ వెల్లడి

బీసీ ప్రభంజనం సభకు ముఖ్యఅతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య

ఎల్బీనగర్:

మే 24 ఆదివారం ఎల్బీనగర్ లో జరగనున్న బీసీ ప్రభంజనం సభకు ముఖ్యఅతిథిగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరవుతారని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సత్యనారాయణ ఆర్. కృష్ణయ్యను శుక్రవారం ఆయన నివాసంలో కలిసి బీసీ ప్రభంజనం సభకు రావాలని ఆహ్వానించారు.‌ బీసీ ఉద్యమానికి మద్దతుగా జరుగుతున్న బీసీ ప్రభంజనం సభకు ఖచ్చితంగా హాజరవుతానని ఆర్. కృష్ణయ్య హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రధానంగా వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని బీసీ ప్రభంజనం నిర్వహించడం జరుగుతుందని సత్యనారాయణ వివరించారు. గతంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందించిన ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభకు హాజరు కావడం బీసీ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుందని సత్యనారాయణ వివరించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే బీసీ ప్రభంజనం సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నేతలు హాజరు కానున్నారని ఆయన అన్నారు. మే 24 న ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభ బీసీ ఉద్యమంలో చారిత్రాత్మకంగా నిలిచి పోతుందని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజే రాష్ట్ర నాయకులు జాల కిషన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారని కిషన్ ఈ సందర్భంగా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలని ఎస్సీ ఎస్టీ, బీసీ జేఏసీ కన్వీనర్ తెలంగాణ వెంకన్న విజ్ఞప్తి చేశారు. మే 24న ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న దళితులు, గిరిజనులు, బీసీలు ఏకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

About The Author