ఈ-చెత్తను వదిలించుకో.. ‘రివార్డు’ పట్టుకో!

  • బడంగ్‌పేట్ సర్కిల్‌లో రేపు, ఎల్లుండి ‘ఈ-వేస్ట్’ సేకరణ
  • వార్డుల వారీగా 6 కలెక్షన్ సెంటర్లు*
  • వ్యర్థాలిస్తే యాప్‌లో పాయింట్లు.. కొనుగోళ్లపై డిస్కౌంట్లు

ఈ-చెత్తను వదిలించుకో.. ‘రివార్డు’ పట్టుకో!

బడంగ్‌పేట్:

మీ ఇంట్లో పాత మొబైల్ ఫోన్లు ఉన్నాయా? విరిగిపోయిన చార్జర్లు, పనికిరాని కంప్యూటర్లు, బ్యాటరీలతో ఇబ్బంది పడుతున్నారా? వాటిని ఎక్కడ పడేయాలో తెలియక స్టోర్ రూమ్‌లో మూలన పెట్టారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆ చెత్తను వదిలించుకోవడమే కాకుండా, తద్వారా డిస్కౌంట్లు కూడా పొందే అవకాశాన్ని జీహెచ్‌ఎంసీ కల్పిస్తోంది. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా బడంగ్‌పేట్ సర్కిల్–16 పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో భారీ ఎత్తున 'ఈ-వ్యర్థాల సేకరణ' డ్రైవ్‌ను నిర్వహించనున్నారు.

యాప్‌లో నమోదు.. 
ఈ డ్రైవ్ ప్రత్యేకత ఏంటంటే.. మీరు ఇచ్చే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు విలువ ఉంటుంది. సేకరించిన వ్యర్థాల వివరాలను వెంటనే 'Loop Sustainability' అనే యాప్‌లో ఇన్-చార్జీలు నమోదు చేస్తారు. దీని ద్వారా పౌరులకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను ఉపయోగించి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎన్‌జీఓలు, నిర్దేశిత షాపుల్లో వస్తువులు కొన్నప్పుడు భారీగా డిస్కౌంట్లు పొందవచ్చు. అంటే మీ ఇంటి చెత్తే మీకు లాభాన్ని తెచ్చిపెట్టబోతోంది.

ఎక్కడెక్కడ అంటే..?
ప్రజలు సులభంగా ఈ-వేస్ట్‌ను అందజేసేందుకు సర్కిల్ పరిధిలో ఆరు కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు:
 
నాదర్‌గుల్ (57): గుర్రంగూడ వార్డు ఆఫీస్
 ప్రశాంతి హిల్స్ (58): నంది హిల్స్ బస్ స్టాప్
 జిల్లెలగూడ (59): సీనియర్ సిటిజన్ భవన్
మీర్‌పేట్ (60): మీర్‌పేట్ వార్డు ఆఫీస్
 బడంగ్‌పేట్ (61): సర్కిల్-16 ఆఫీస్
 బాలాపూర్ (62): పాత ఎంఆర్‌ఓ ఆఫీస్

పర్యావరణం కోసం కలిసి రండి: డిప్యూటీ కమిషనర్
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ.. ఈ-వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు, గాలి కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే శాస్త్రీయంగా వీటిని రీసైక్లింగ్ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను తీసుకొచ్చి నగరాన్ని క్లీన్‌గా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.WhatsApp Image 2026-05-08 at 18.16.11 (1)

About The Author