గుమ్మడిదల లో 26 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల:
గుమ్మదల మున్సిపాలిటీ, మండల పరిధిలోని వివిధ వార్డులు, గ్రామాల పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పంపిణీ చేశారు.
గురువారం ఉదయం గుమ్మడిదల తహసిల్దార్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఈ పథకాన్ని ప్రవేశ పట్టడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
About The Author
09 May 2026
