జిల్లాకు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్ : సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 01: కేంద్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన రూ:50,65,345 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో జిల్లాకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే జిల్లా అభివృద్ధి పట్ల బిజెపి పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని అన్నారు.బీహార్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిక నిధులు ఆ రాష్ట్రానికే కేటాయించారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి బిజెపి పార్టీకి ఒక ఎమ్మెల్యే ని గెలిపించి ఇచ్చిన కామారెడ్డిని మాత్రం విస్మరించారని ఇది కామారెడ్డి ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. అలాగే మధ్యతరగతి జీవులకు ఉపశమనం కలిగించే ఇన్కమ్ టాక్స్ లిమిట్స్ ని 15 లక్షలకు పెంచాల్సి ఉండేదని కామారెడ్డి ప్రజలకు అత్యవసరమైన రెండు రైల్వే గేట్ల వద్ద నిర్మాణానికి నిధులు అత్యవసరమని గుర్తించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 01:
కేంద్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపింది.
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన రూ:50,65,345 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో జిల్లాకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే జిల్లా అభివృద్ధి పట్ల బిజెపి పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని అన్నారు.బీహార్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిక నిధులు ఆ రాష్ట్రానికే కేటాయించారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి బిజెపి పార్టీకి ఒక ఎమ్మెల్యే ని గెలిపించి ఇచ్చిన కామారెడ్డిని మాత్రం విస్మరించారని ఇది కామారెడ్డి ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. అలాగే మధ్యతరగతి జీవులకు ఉపశమనం కలిగించే ఇన్కమ్ టాక్స్ లిమిట్స్ ని 15 లక్షలకు పెంచాల్సి ఉండేదని కామారెడ్డి ప్రజలకు అత్యవసరమైన రెండు రైల్వే గేట్ల వద్ద నిర్మాణానికి నిధులు అత్యవసరమని గుర్తించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
