మల్లెమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

WhatsApp Image 2025-11-14 at 7.26.01 PM

ఖమ్మం ప్రతినిది : 

Read More నేటి భారతం :

 ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు నవంబర్ 14 న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం  పేరెంట్ టీచర్ మీటింగ్ తో కలిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా  జరుపుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె .సాంబమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇందులో బాలికల అక్రమ రవాణా అనే నాటిక ఎంతో ఆకట్టుకుంది, దేశ నాయకుల వేషధారణ ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ వకృత్వ సాంస్కృతిక దేశ నాయకుల వేషధారణ లలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు  చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.. 

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

About The Author