కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇటీవల తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షులుగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు నూతనంగా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్ కు సిరిసిల్ల పట్టణంలోని వారి నివాసంలో ఘనంగా సన్మానించి,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియమకంపై నాయకులు సంతోషం వ్యక్తం చేసి పార్టీ బలపడేందుకు అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నాయకత్వం ఎంతో కీలకమని అన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాకు విశ్వసించి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కట్టుబడి పని చేస్తానని అన్నారు,అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించే విధంగా చూస్తానని అన్నారు. అలాగే తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కూరగాయల కొమురయ్య, నాగుల విష్ణు ప్రసాద్, నాయకులు అంబాటి చందు,ఎర్రం రాజు, మాజీ సర్పంచ్ ప్రదీప్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
