కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తాo
బిఆర్ఎస్ పార్టీ ములుగునియోజకవర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతి
ములుగు జిల్లా :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయిమండలంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బడే నాగజ్యోతి హాజరై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
తదనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించిందని ఆమె తెలిపారు.ఆరు గ్యారంటీలతో 420 హామీలతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆమె కోరారు. గత 10 సంవత్సరాల కెసిఆర్ పాలన ఎరువుల కొరత రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చెప్పులు, పట్టా పాస్ బుక్కులతో క్యూలైన్లు ఉంటున్నారని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.
