సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఐడిఓసి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఐడిఓసి ఆవరణలో పారిశుధ్య తనిఖీ నిమిత్తం సందర్శించారు.
ఈ సందర్భంగా సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు.
పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ శుభ్రమైన వాతావరణం ఉండేలా రోజువారీ పారిశుధ్య చర్యలు క్రమబద్ధంగా చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అక్కడక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని గమనించి, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని, వాటి సంరక్షణను ప్రతీ రోజూ పర్యవేక్షించాలని, ఎక్కడా కూడా అపరిశుభ్రంగా ఉండకూడదని, చెత్త చెదారం వెంట వెంటనే తొలగించాలని ఐడిఓసి ప్రాంగణం కలియ తిరుగుతూ ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల పెంపకం పై దిశా నిర్దేశం చేశారు.
