జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

జయశంకర్ భూపాలపల్లి :
భూపాలపల్లి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సహకారం కొనసాగాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ జిల్లా అబివృద్దిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.
