యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు
రవాణా శాఖ అధికారి బారగడి శ్రీనివాస్
ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లారవాణా శాఖ జిల్లా అధికారి బారగాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంను జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశానికి హాజరైన వారందరితో "నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని,నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని,డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు,అక్రమ రవాణా, చేసే వ్యక్తులు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగా స్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను" అని యువతతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది,యువత,తదితరులు పాల్గొన్నారు.