పోలీసు ప్రతిష్టను కించపరిచేలా తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు

ప్రజలు పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్, నాగేశ్వరరావు

WhatsApp Image 2025-11-04 at 6.46.32 PM

సూర్యాపేట : 

Read More నాగారం గ్రామ సర్పంచిగా చందరాజు లావణ్య సంతోష్ నామినేషన్ దాఖలు

నాగారం సర్కిల్ పరిధిలో గల అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి స్టేషన్ల పరిధిలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నాగారం సర్కిల్ పోలీస్ సిబ్బంది అనుక్షణం విధులు నిర్వహిస్తున్నారని నిత్యం తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రత రక్షణలో రాత్రి, పగలు,ఎండ,వానలో,క్లిష్ట సమయాల్లో పని చేస్తున్నామని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబాలను వదిలి ప్రాణాలు లెక్కచేయక ప్రజల రక్షణలో అనుక్షణం పోలీసులు పని చేస్తున్నారు, అనారోగ్యంగా ఉన్నప్పటికీ భార్యాపిల్లలకు దూరంగా ఉండి బారివర్ష సూచన నేపద్యంలో గత కొద్దిరోజులుగా రాత్రి, పగలు అర్వపల్లి మండల పరిధిలో ప్రజల భద్రతలో విధులు నిర్వర్తించి అలసిపోయి కొద్దిపాటి విరామం తీసుకునే సమయములో దురుద్దేశ్య పూర్వకంగా అర్వపల్లి పోలీసు స్టేషన్ గేట్ల నుండే వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చి కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటున్న ఎస్సై ని ఉద్దేశ్యపూర్వకంగా వీడియో తీసి ఎస్సై ఆత్మాబిమానం దెబ్బతినేలా, పోలీసు శాఖను అగౌరపరుస్తూ సోషల్ మీడియా నందు చేడుగా ప్రచారం చేశారు, ఇది సరి కాదు అని సీఐ తెలిపారు.వీడియో చిత్రీకరించిన వారిపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై ప్రోత్సహించిన వారిపై అర్వపల్లి స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము అన్నారు. ఇలాంటి వాటిని ఎవరైనా ప్రోత్సహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు ప్రచారం చేయవద్దు అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతలో పోలీసు కార్యాలయాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని బాధితులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఏసమయంలోనైనా నేరుగా వారి సమస్యలపై పోలీస్ స్టేషన్ నందు పిర్యాదులు చేయవచ్చు ఎస్సై స్పందించకపోతే సీఐ ఆపై అధికారులకు పిర్యాదు చేసి పోలీసు సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా పోలీస్ కార్యాలయాల్లోకి వచ్చి పోలీసు శాఖకు భంగం కలిగేలా సమస్యలు సృష్టించవద్దు, కార్యకలాపాలకు పాల్పడవద్దు అని కోరారు. అలాగే ఏదైనా సమాచారాన్ని ప్రచారం చేయదలచిన, వార్తను ప్రచురితం, ప్రసారం చేయదలచిన అలాంటి దానిపై ముందస్తుగా పై అధికారులకు తెలియజేయాలని, నిజానిజాలు వివరణ తీసుకోవచ్చని తెలిపారు.. 

Read More ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

About The Author