తల తాకట్టు పెట్టైనా…ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తాం…!!

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13: తల తాకట్టు పెట్టైనా రాబోవు నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతీ పేదవానికి కట్టించి ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కొణిజర్ల మండలం కొండవనమాలలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పుట్టిన ఊరుని కన్న తల్లితండ్రులను మరిచి పోతున్న ఈ రోజుల్లో తను పుట్టి పెరిగిన ఈ ఊరికి ఏదోక సాయం చేయాలనే తపనతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన వత్సవాయి రవిని, ఆయన శ్రేయోభిలాషి మాజీ ఎంపీపీ గోసు మధును అభినందించారు. వారిద్దరిని రామలక్ష్మణులుగా కీర్తించారు. రాబోవు మూడు నాలుగు రోజుల్లో సన్నాలకు బోనస్ పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మూడు ఎకరాలు అన్న రైతులకు రైతు భరోసా అందిందని అంతకంటే ఎక్కువ ఎకరాలు అన్న వారికి త్వరలోనే పడుతుందని పేర్కొన్నారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతీ హామీని అనేక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృషితో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయన్నారు. కులగణనలో పాల్గొనని వారి కోసం మరొక మారు కులగణన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

తల తాకట్టు పెట్టైనా…ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తాం…!!

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13:

తల తాకట్టు పెట్టైనా రాబోవు నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతీ పేదవానికి కట్టించి ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కొణిజర్ల మండలం కొండవనమాలలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పుట్టిన ఊరుని కన్న తల్లితండ్రులను మరిచి పోతున్న ఈ రోజుల్లో తను పుట్టి పెరిగిన ఈ ఊరికి ఏదోక సాయం చేయాలనే తపనతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన వత్సవాయి రవిని, ఆయన శ్రేయోభిలాషి మాజీ ఎంపీపీ గోసు మధును అభినందించారు. వారిద్దరిని రామలక్ష్మణులుగా కీర్తించారు. రాబోవు మూడు నాలుగు రోజుల్లో సన్నాలకు బోనస్ పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మూడు ఎకరాలు అన్న రైతులకు రైతు భరోసా అందిందని అంతకంటే ఎక్కువ ఎకరాలు అన్న వారికి త్వరలోనే పడుతుందని పేర్కొన్నారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతీ హామీని అనేక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృషితో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయన్నారు. కులగణనలో పాల్గొనని వారి కోసం మరొక మారు కులగణన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

About The Author