ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు

చైర్మన్, వైస్ చైర్మన్ తో సహా పది మందితో కమిటిలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

WhatsApp Image 2025-11-04 at 6.20.53 PM

సూర్యాపేట : 

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

ఎత్తిపోతల నిర్మాణాలలో విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.నాణ్యతా ప్రమాణాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.నాణ్యతా లోపించిందని తెలిస్తే ఉపేక్షించేది లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.రైతాంగాం కళ్ళలో వెలుగులు నింపడంతో పాటు హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గలను సస్యశ్యామలం చేయడానికే ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టమన్నారు.అటువంటి నిర్మాణంలో నాణ్యత లోపించిందని తేలితే సహించేది లేదని ఆయన అధికారులకు,ఏజెన్సీ లకు అల్టిమేటం జారీ చేశారు. హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గాలలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలపై మంగళవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయితి కార్యాలయంలో నామినేషన్స్

కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్,ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్,శ్రీనివాస్, రమేష్ బాబు లతో పాటు హుజుర్నగర్ కోదాడ నియోజకవర్గలకు చెందిన ప్రజాప్రతినిధులు,నీటిపారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పధకంతో పాటు జవహర్ జానపహాడ్ బ్రాంచ్ కెనాల్,బెట్టే తండా,నక్కగూడెం,రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాల పురోగతి తో పాటు,హుజుర్నగర్ లో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన పురోగతిపై ఆయన సమీక్షించారు.అంతే గాకుండా కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్,ఆర్-9,మోతే ఎత్తిపోతల పథకాలతో పాటు కోదాడ లో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన నిర్మాణం పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టు కుబనుకుని ఉన్న భూములు సేద్యంలోకి వస్తాయని భావిస్తే ఎత్తిపోతల పథకాల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు. మైనర్ మార్పులతో ఆదనపు ఆయకట్టు సేద్యం లోకి వచ్చిందుకు అయ్యే అదనపు నిధులను సమకూరుస్తానాని ఆయన వెల్లడించారు.

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎత్తిపోతల పథకాల నిర్మాణాల నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ నిర్వహించి రైతులకు నగదు చెల్లింపులు జరిపిన భూములను సత్వరమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంటకు పంటకు మధ్యలో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.ఎత్తిపోతల పథకాల నిర్మాణాల పై ఆయకట్టు రైతాంగం పెంచుకున్న ఆశలు అమలులోకి రావాలి అంటే నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడమే నని ఆయన పేర్కొన్నారు.. 

Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

About The Author