ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఖమ్మం ప్రతినిది :

WhatsApp Image 2025-08-20 at 6.42.01 PM

భారత మాజీ ప్రధాని స్వర్గీయ  రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తోటపల్లి స్వామి  ఆధ్వర్యంలో పలు స్మారక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ స్మారక సభను నిర్వహించి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ యువనేత బీపీ నాయక్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమా చేబ్రోలు లు పాల్గొన్నారు.

Read More పంచుకుంటే పెరిగేది ఆనందం

అనంతరం రాజీవ్ మహావృక్షం పేరిట స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మొక్కలను నాటారు. అనంతరం రాజీవ్ యువనేస్తం పేరిట స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన మరియు వకృతం డిబేట్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతి ప్రధానోత్సవంతో అభినందన సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా బీపీ నాయక్, రమా లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ అనేక నూతన సంస్కరణలకు మారుపేరని, వారి హయాంలోనే సమాచార సాంకేతికత మరియు టెలికాన్ విప్లవాన్ని, సరికొత్త విదేశాంగ విధానం మరియు శాంతి ఒప్పందాలను, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన విధానాన్ని, నూతన ఆర్థిక సంస్కరణలను ప్రోత్సహించి బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ ప్రోత్సహించారని, నూతన విద్యా సంస్కరణలో తీసుకొచ్చి నవోదయ విద్యాలయాల స్థాపనను గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను రాజీవ్ గాంధీ అందించారని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా రాజీవ్ గాంధీ నిలబెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీపథం నాయకులు పాసంగులపాటి కోటేశ్వరరావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమరేసి ప్రమీల, శివాలయ ఆలయ కమిటీ చైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీదు శ్రీనివాసరావు, యార్లగడ్డ కృష్ణయ్య, రామాచారి, మాజీ వార్డు సభ్యురాలు అంతోటి జయకుమారి, అరుణ్ , గ్రామశాఖ ఉపాధ్యక్షులు బానోతు జ్వాలా, ప్రధాన కార్యదర్శి గుగులోతు వేణు, భూక్యా రమేష్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.

Read More మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలి

About The Author