అట్టహాసంగా ఆర్.డి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో గెట్ టూ గెదర్ పార్టీ వేడుకలు..

- ప్రిన్సిపాల్ సంజీవ్ రావు వెల్లడి

ఉమ్మడి వరంగల్ బ్యూరో: 

WhatsApp Image 2025-09-22 at 6.00.51 PM

ఆర్.డి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినిలు గెట్ టు గెదర్ పార్టీవేడుకలను భీమారం లోని జగతి గార్డెన్స్ లో అట్టహాసంగా సోమవారం నిర్వహించుకున్నారని కళాశాల ఛైర్మెన్ రాంమూర్తి,డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ సంజీవరావు తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగివున్న ప్రతిభా పాటవాలు, సృజనాత్మకశక్తి వెలుగులోకి వస్తాయని తెలిపారు.ఇలాంటి పార్టీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహభావం,సోదర భావం పెంపొందుతుందని ప్రిన్సిపాల్ సంజీవ రావు తెలిపారు.అనంతరం వివిధ పోటీల్లో  గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సంజీవ్ రావు,అధ్యాపకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మల్లేశం,జాయింట్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ రాంబాబు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి..

About The Author