యోగ పోటీలో గురుకుల విద్యార్థులకు గోల్డ్

మణుగూరు :
కరీంనగర్ జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగిన ఎస్.జి.ఎఫ్ రాష్ట్రస్థాయి యోగ పోటీలలో మణుగూరు గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్ 17 రిటమిక్ ఫెయిర్ కేటగిరీలో విద్యార్థులు ఎం.రమ్య బి.సహస్ర గోల్డ్ మెడల్ సాధించారు. గెలుపొందిన విద్యార్థినులను సోమవారం ప్రిన్సిపల్ రాణి, ఆర్.సి.ఓ అరుణ కుమారి వ్యాయామ ఉపాధ్యాయురాలు వైనాల కావ్య, సరస్వతి, సుజాత, సునీత అభినందించారు.
About The Author
18 Feb 2026
