ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు సాకి చెరువు ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. అనంతరం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎం డి ఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. రైతాంగం, కూలీలు, బలహీన వర్గాల కోసం ఆమె చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకం. యువతరం ఆమె ఆలోచనలతో ముందుకు సాగితేనే సమాజంలో నిజమైన సమానత్వం, న్యాయం సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని చాకలి ఐలమ్మ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
About The Author
12 Feb 2026
