రామాలయం అభివృద్ధికి నిధులు కోరుతూ మంత్రికి వినతి

రామాలయం అభివృద్ధికి నిధులు కోరుతూ మంత్రికి వినతి

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కొట్టె స్వామి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆలయ అభివృద్ధి పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు గడీల జనార్దన్ రెడ్డితో కలిసి కొట్టె స్వామి మంత్రిని శాలువాతో సన్మానించారు.కార్యక్రమంలో అయన వెంట పార్టీ నాయకులు స్వామి రెడ్డి తదితరులు ఉన్నారు.

About The Author