అక్రమ కూల్చివేతలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్ పేట్:
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బడంగ్‌పేట్ పరిధిలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలపై, ముఖ్యంగా ఫుట్‌పాత్‌ల తొలగింపులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అలాగే త్రాగునీరు, శానిటేషన్ సమస్యలు, టెండర్లు ఖరారైనప్పటికీ ఇంకా ప్రారంభం కాని అభివృద్ధి పనులు, పూర్తికాని పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య డిఈ, ఏఈ, పోలీస్,టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
22 Apr 2026
