ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

--నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్.

WhatsApp Image 2025-11-11 at 6.22.37 PM

రాజన్న సిరిసిల్ల : 

Read More గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

స్వాతంత్ర సమర యోధుడు, భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై  కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి ఇంచార్జి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతు దేశ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ విద్యా వ్యవస్థ నిర్మాణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలను కొనియాడారు.ఇక్కడ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Read More దేవుని గుట్టను సందర్శించిన అటవీశాఖ ముఖ్య కన్సర్వేటర్అధికారి సువర్ణ

About The Author