మానసిక శాంతికి ధ్యానం ఎంతో అవసరం
బ్రహ్మకుమారిస్ సంస్థ డైరెక్టర్ బి.కే. సుమంగళ

సంగారెడ్డి : ధ్యానం ద్వారా మానసిక శాంతి అనుభూతి కలుగుతుందని బ్రహ్మకుమారిస్ సంస్థ డైరెక్టర్ బి కే సుమంగళ అన్నారు.సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో బ్రహ్మకుమారీస్ సంస్థలు మీడియా వారికి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారీస్ సంస్థ డైరెక్టర్, బి.కె సుమంగళ పాల్గొన్నారు. రాజ్యాంగానికి నాలుగో పిల్లర్ మీడియాని ఆమె తెలిపారు. మీడియాలో పనిచేసే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా సమయం బిజీగా ఉంటారు. అయినప్పటికీ కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించి మానసికంగా శాంతి అనుభూతి పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీదర్ బ్రహ్మకుమారి సెంటర్ ఇన్చార్జి బి.కే. సునంద, బి.కే. అన్నపూర్ణ, బీ.కే. జగదీశ్వర్, బి.కే. రాజవర్ధన్, బి కే. సంతోష్, బి.కే. రాధిక, విశ్రాంత మండల విద్యాధికారి మరియు అడ్వకేట్ డి అంజయ్య, విశ్రాంత సైనికులు పాల్గొన్నారు.
About The Author
17 Mar 2026
