సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ లో నిర్మల్ వాసి మీర్జా జహీర్ బేగ్ సభ్యత్వం

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ కు చెందిన మీర్జా జహీర్ బేగ్ కు ప్రతిష్టాత్మక సౌదీ కౌన్సిల్ అఫ్ ఇంజినీర్స్ లో సభ్యత్వం లభించింది. జియో టెక్నీకల్ (భూగర్భ సాంకేతిక) రంగ నిపుడైన బేగ్ సేవలను గుర్తించిన సౌదీ అరేబియా ప్రభుత్వం జనవరి 9న సభ్యత్వ సర్టిఫికెట్ జారీ చేసింది. యాదృచ్చికంగా జనవరి 9 ‘ప్రవాసీ భారతీయ దివస్’ కావడం విశేషం. మాజీ ఎంపీ రామచంద్ర కుంతియా, వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సౌదీ అరేబియాను సందర్శించిన సందర్బంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో బేగ్ ను సన్మానించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ బృందం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ లో నిర్మల్ వాసి మీర్జా జహీర్ బేగ్ సభ్యత్వం

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 01: నిర్మల్ కు చెందిన మీర్జా జహీర్ బేగ్ కు ప్రతిష్టాత్మక సౌదీ కౌన్సిల్ అఫ్ ఇంజినీర్స్ లో సభ్యత్వం లభించింది. జియో టెక్నీకల్ (భూగర్భ సాంకేతిక) రంగ నిపుడైన బేగ్ సేవలను గుర్తించిన సౌదీ అరేబియా ప్రభుత్వం జనవరి 9న సభ్యత్వ సర్టిఫికెట్ జారీ చేసింది. యాదృచ్చికంగా జనవరి 9 ‘ప్రవాసీ భారతీయ దివస్’ కావడం విశేషం.
మాజీ ఎంపీ రామచంద్ర కుంతియా, వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సౌదీ అరేబియాను సందర్శించిన సందర్బంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో బేగ్ ను సన్మానించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ బృందం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

About The Author