ఐక్యతతోనే రజకుల భవిష్యత్తు
- ఘనంగా రజక ఆత్మీయ సమ్మేళనం
- ఆర్టీవో ఎంవిఐ సంగం వెంకట పుల్లయ్య

మణుగూరు :
రజక కులస్తులు ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని భద్రాచలం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎం.వి.ఐ) సంగం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని తోగ్గుడెం గ్రామంలో గల శ్రీ సమ్మక్క–సారక్క ఆలయం వద్ద మణుగూరు మండల రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రజక ఆత్మీయ సమ్మేళనం (వన భోజనాలు) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందు పీవీ కాలనీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, రజకులు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు రావాలని, ప్రతి ఏడాది ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పరస్పర కష్టసుఖాలను పంచుకోవాలని సూచించారు. సమ్మేళనంలో నిర్వహించిన మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మీడియా మిత్రులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. రజకుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పడంలో మీడియా పాత్ర అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిటికెన భాస్కర్, పున్నం భిక్షపతి, వల్లంకొండ అప్పయ్య, పున్నం ఉమామహేశ్వరరావు, తనకం ముజాకర్, పొనగంటి కృష్ణ, రాపర్తి శ్రీహరి, అక్కినపల్లి సత్యనారాయణ, సట్టు యాకయ్య, పొన్నా కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
