
రాపర్తి నగర్ 2 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరముల నుండి గణనాథునికి విశేషపూజలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా శుక్రవారం 400 మంది మహిళా భక్తుల చేత కుంకుమ పూజలు జరిగాయి. ఈ కుంకుమ పూజలకు ఆర్ధికంగా సహకరించిన కుంచెపు రాంబాబు విద్య దంపతులకు ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియచేసింది.
ఈ కుంకుమ పూజలను నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, ఉప మేయర్ ఫాతిమా జోహార్ ముక్తార్ ఘనంగా ప్రారంభించారు.
వచ్చిన మహిళా భక్తులకు పూజ సామాగ్రి మరియు గిప్టులు కుంచెపు రాంబాబు దంపతుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శెట్టి రంగారావు, బండారుపల్లి గంగాధర్ రావు, చిలకా కోటయ్య, ఆకుతోట ఉపేందర్, నాంపల్లి శంకరయ్య, కొక్కుల మాధవరావు, ఏటుకూరి కోటేశ్వరరావు, తాళ్లూారి సోమయ్య, నూతక్కి నాగార్జున, మద్ది వెంకటరెడ్డి, పెడేటి రమేష్, బానోతు భావ్ సింగ్, దేవిశెట్టి వెంకటేశ్వర్లు, వెంకట నారాయణ, నాగరాజు, మల్లేపల్లి సింహరెడ్డి,కోట రంగయ్య,మందడపు శ్రీనివాసరావు,సబిత,అనురాధ,సులోచన,సత్యావతి,ప్రభావతి, వాణి, విజయలక్ష్మి మరియు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.