బడంగ్‌పేట్ సర్కిల్‌లో ముమ్మరంగా ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
- పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో.. ఆరోగ్యం అక్కడ ఉంటుంది..,జోనల్ కమిషనర్ కె. చంద్రకళ, డెప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వర్ రావు,
- నగరంలో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ తొలగింపు.. 12 నుంచి ఈ-వేస్ట్ సేకరణ
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ (సర్కిల్-16) పరిధిలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టారు. జోనల్ కమిషనర్ కె. చంద్రకళ, డెప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వర్ రావు పర్యవేక్షణలో శుక్రవారం అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పారిశుధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు.
డివిజన్ల వారీగా లెగసీ వేస్ట్ తొలగింపు:
* 57వ డివిజన్: నాదర్గుల్, కుర్మగూడ విలేజ్ రైస్ గోదాం వెనుక వైపు ఉన్న ప్రధాన రహదారిపై వ్యర్థాలను తొలగించారు.
* 59వ డివిజన్: జిల్లెల్‌గూడ ప్రగతి నగర్ పరిధిలో చెత్తను క్లీన్ చేశారు.
* 60వ డివిజన్: మీర్‌పేట్ అయోధ్య నగర్, మైసమ్మ గుడి సమీపంలోని వ్యర్థాలను తొలగించారు.
* 61వ డివిజన్: బాలాపూర్ నుంచి బడంగ్‌పేట్ వెళ్లే ప్రధాన రహదారిపై పారిశుధ్య చర్యలు చేపట్టారు.
* 62వ డివిజన్: బాలాపూర్ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్ సమీపంలోని వ్యర్థాలను తొలగించారు.
ఈ నెల 12, 13 తేదీల్లో ఈ-వేస్ట్ సేకరణ:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నెల 12, 13 తేదీలలో ప్రత్యేకంగా ఈ-వేస్ట్ (E-Waste) సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లెల్‌గూడ వార్డు ఆఫీసు లేదా బడంగ్‌పేట్ కమ్యూనిటీ హాల్ వద్ద అందజేయాలని అధికారులు కోరారు.
సేకరించే వస్తువులు:
* పెద్ద పరికరాలు: రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాటర్ కూలర్లు.
* చిన్న పరికరాలు: మిక్సీలు, గ్రైండర్లు, ఇస్త్రీ పెట్టెలు, ట్రిమ్మర్లు, ఫ్యాన్లు.
* ఐటీ పరికరాలు: కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మౌస్, ప్రింటర్లు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు.
* ఎలక్ట్రానిక్స్: టీవీలు, మ్యూజిక్ సిస్టమ్స్, కెమెరాలు, సర్క్యూట్ బోర్డులు.
* ఇతరాలు: యూపీఎస్, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, స్మార్ట్ వాచ్‌లు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎం. అన్వర్ కుమార్, ఎస్. హరీష్, గంగా ప్రసాద్, మేనేజర్ జి. శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వి. యాదగిరి, నరసింహ, రాము, వార్డు ఆఫీసర్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
