దళితుల భూముల్ని రక్షించాలని ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత

WhatsApp Image 2025-10-29 at 7.06.47 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

Read More నేటి భారతం :

సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో దళితుల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించిన గ్రామ విడీసీ సభ్యులపై చర్యలు తీసుకొని దళితుల భూమిని తిరిగి వారికి అప్పగించాలని కోరుతూ బుధవారం రోజు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో సోన్ ఎమ్మార్వో  నీ కలిసి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోల్ల వెంకటస్వామి మాట్లాడుతూ పాక్పట్ల గ్రామంలోని బోర ముత్యం, బోర చిన్న గంగన్న, బోర నడిపి నరసయ్య కి చెందిన భూమిలో బుధవారం రోజు ఉదయం ఏడు గంటల సమయంలో వీడీసీ సభ్యులు అందరూ వచ్చి దౌర్జన్యంగా వారి అనుమతి లేకుండా వారి పట్టా భూములలో మట్టి రోడ్డును వేశారని వెంటనే ఎమ్మార్వో  స్పందించి వారి భూమిలో వేసిన రోడ్డును తొలగించి దళితులను రక్షించాలని వారి భూములను పరిరక్షించాలని అన్నారు జిల్లా నాయకులు  రవి, సుధీర్, రమేష్, బోర ముత్యం, బోర చిన్న గంగన్న, బోర నడిపి నరసయ్య, బోర శ్రీనివాస్ తదితరలు ఉన్నారు.

Read More డస్ట్ తరలిస్తున్న టిప్పర్ సీజ్.

About The Author