నేటి భారతం

నువ్వెప్పుడైతే ఎక్కువుగా ఆశపడతావో..
అప్పుడే నీ పతనం మొదలవుతుంది..
అయాచితంగా వచ్చేది ఏదైనా సరే..
నిర్మొహమాటంగా నాకు వద్దు అని చెప్పడం ఎంతో మంచిది..
నీకు ప్రాప్తం ఉన్నది నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను చేరుతుంది..
నీది కానీ దానికోసం అర్రులు చాస్తే కాలం కూడా నీకు సహకరించదు..
అందుకే నిన్ను మోసం చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు..
అడుగడుగునా నీ కదలికలను గమనిస్తున్నారు..
నిన్ను నట్టేట ముంచడానికి పథకాలు రచిస్తూ ఉంటారు..
నువ్వు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం..
నిన్ను కాపాడే బదులు.. అక్రమార్కులకు సహకరిస్తోంది..
అందుకే ఎవరినీ నమ్మకు.. అత్యాశకు పోకు..
నిజాయితీగా ఉండు.. నువ్వనుకున్నది సాధించు..
About The Author
06 Dec 2025
