స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 03:: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సరస్వతీ మాతకు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేదమంత్రాలతో చదువుల తల్లి సరస్వతీ దేవికి సాంప్రదాయబద్ధంగా, మంగళకరంగా పూజలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరికీ సరస్వతీ మాత దీవెనలు అందించాలని వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు వేద పండితులు శాస్త్రం ప్రకారం అక్షరాభ్యాస క్రతువును నిర్వహించారు. ఓం, శ్రీకారంతో చిన్నారుల చేత బలపంతో దిద్దించి అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. అక్షరాభ్యాసం లో పాల్గొన్న చిన్నారులకు అక్షింతలతో దీవెనలు అందించారు. అక్షరాభ్యాస క్రతువులో పాల్గొన్న చిన్నారులకు పూజా సామాగ్రిని పాఠశాల యాజమాన్యం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ వసంత పంచమి రోజున సరస్వతీ మాత పుణ్య జన్మ తిథి నిర్వహిస్తున్నామని , చదువుల తల్లి అమ్మవారి దీవెనలు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 03::
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సరస్వతీ మాతకు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేదమంత్రాలతో చదువుల తల్లి సరస్వతీ దేవికి సాంప్రదాయబద్ధంగా, మంగళకరంగా పూజలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరికీ సరస్వతీ మాత దీవెనలు అందించాలని వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు వేద పండితులు శాస్త్రం ప్రకారం అక్షరాభ్యాస క్రతువును నిర్వహించారు. ఓం, శ్రీకారంతో చిన్నారుల చేత బలపంతో దిద్దించి అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. అక్షరాభ్యాసం లో పాల్గొన్న చిన్నారులకు అక్షింతలతో దీవెనలు అందించారు. అక్షరాభ్యాస క్రతువులో పాల్గొన్న చిన్నారులకు పూజా సామాగ్రిని పాఠశాల యాజమాన్యం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ వసంత పంచమి రోజున సరస్వతీ మాత పుణ్య జన్మ తిథి నిర్వహిస్తున్నామని , చదువుల తల్లి అమ్మవారి దీవెనలు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
