ప్రజల మద్దతుతో బిజెపి పార్టీ శ్రేణుల కృషితో గెలుపు ఖాయం: బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి): సామాజిక సేవ చేసే వ్యక్తులు, పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తులు అందరికి ఆమోద యోగ్యమైన వ్యక్తులను నిర్ణయించడం భారతీయ జనతా పార్టీ పార్టీ గొప్పతమని, జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజీపీ పార్టీకి చెందిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లు బారి మెజార్టీ తో వజయం సాధిస్తారని బిజెపి నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని ఓ పంక్షన్ హాలులో మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతుతో, బిజెపి పార్టీ శ్రేణుల కృషితో మా అభ్యర్థులు గెలుస్తారని స్పష్టంగా అర్థమవుతుందని, పార్టీ అభ్యర్థుల ఎంపికనే విజయానికి మార్గమన్నారు. అభ్యర్థులు ఇద్దర్జు ఎలాంటి మచ్చలేని నాయకులని కితాబిచ్చారు. దీనికి అనువుగా ప్రజలు కూడ బీజేపికి మద్దతు పలుకుతున్నారనీ, కరీంనగర్ ఎంపి, పెద్దలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సజయ్ కుమార్ నాయకత్వంలో రాబోయే 20 రోజులు పార్టీ శ్రేణులమంతా ఐక్యమత్యంగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొసం బిల్లుకు మద్దతు పలికిన పార్టీ భారతీయ జనతా పార్టీఅని, ఎలాంటి ఎన్నికలు జరిగిన తెలంగాణ రాష్ట్రం లో ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారనీ చెప్పారు. రాష్ట్రం లో గత 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేసిన చందంగా తయారైందన్నారు. నిర్ణయాలు ప్రకటించడం తప్పా ఆ నిర్ణయాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కుంటున్న నిర్ణయాల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని లుకలుకలే తప్ప, ఒక వైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు, మరో వైపు మంత్రుల అసంతృప్తితో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్యం ఎవ్వరు డిన్నర్ మీటింగులు పెట్టవద్దని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దిగజారిందో అర్థమౌతుందని మండిపడ్డారు. ఇలాంటి పాలనపై ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనా స్పష్టంగా అర్థమవుతుందనీ గుర్తుచేశారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఒక్క సంక్షేమ పథకం అయినా సరిగ్గా ఇచ్చారా…? అని ప్రశ్నించారు. గడిచిన 14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తూ.. వస్తుందనీ, ఉచిత బస్సు పథకం మినహా ఏ సంక్షేమ పథకం ప్రజలకు సరిగ్గా అమలు కాలేదని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వ పాలన చూసి నవ్వుకుంటున్న ప్రజలు, ఆ పార్టీకి అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్తితి కనిపించడం లేదనీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అనువుగా ఉందొ ప్రజలకు తెలిపిందేనని, బడుగు బలహీనర్గాలకు అనువా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ కి ప్రజలు మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీకి అభ్యర్థిని పెట్టే పరిస్తితి లేదనీ, 70 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో గతం నుండి పనిచేస్తున్న అభ్యర్థులు దొరకని పరిస్తితి నెలకొందని చెప్పారు.కొత్త అభ్యర్థులను తెచ్చి టికెట్లు ఇచ్చుకున్న దౌర్భాగ్యు పరిస్తితి కాంగ్రెస్ పార్టీలో నెలకొందని తెలిపారు. బీజేపీ పార్టీ సంఘు ప్రచార కర్తలుగా పని చేసిన నాయకులను ప్రజా క్షేత్రంలో పోటికి దింపిందనీ ,బీజేపీ పార్టీ నిబద్దతో అభ్యర్థులను బరిలోకి దింపిందనీ. అదే మా పార్టీ గొప్పతన్నారు. అత్యధిక ఓట్లు ఉన్న జిల్లా కరీంనగర్ లో మా పార్టీ శ్రేణులమంతా కలిసి బండి సంజయ్ నాయకత్వం లో కార్యచరణ ప్రకారం ప్రతి ఓటర్ ను కలిసి మద్దతు కోరుతామని చెప్పారు. బారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాల్సిన అవశ్యకత గురించి… ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి ఓటర్లకు అవగాహాన పరుస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు గెలిస్తే రాబోయే రోజుల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేయబోయే సంక్షేమాల గురించి వివరిస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి వివరించి మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్య క్షేత్రం ప్రతి ఓటర్ ను కలిసి మా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడుతాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో పొస్టులు పెట్టే వారికి హెచ్చరిస్తున్నా 5 సంవత్సరాల మాజీ మేయర్ పదవి కాలంలో నగరంలో ఉండి ప్రజలకు పని చేసిన చరిత్రమమధాన్నారు. మీ నాయకుని లాగా దేశాల పర్యటన చేసే వ్యక్తినైతే కాదు. డిసెంబర్ 31, జనవరి1, 2 మీ నాయకులు ఎక్కడ ఉన్నారో మీరే ప్రశ్నించుకొవాలి. డిసెంబర్ 31 వచ్చిన పండగలు వచ్చినా ప్రజల మద్య ఉండే పనిచేశాం తప్పా! మీ నాయకుడిలా శ్రీలంకల, దుబాయ్ దేశాల్లో ఎంజాయ్ చేసే అలవాటు మాకు లేదనీ ఆరోపించారు. మీ నాయకుడిలా ప్రతి రెండు నెలలకు ఒకసారి విదేశాలకు వెల్లి మసాజ్ లు చేస్కునే ఆలోచన మాకు లేదనీ చెప్పారు. మీ నాయకునిలా ఎవ్వరితో పడితే వారితో అసభ్యకరంగా వ్యవహరించడం మాకు రాదనీ , గతంలో వీకెండ్ మస్తీ, క్రాకర్ షోలలో మీ నాయకుడి చేసిన కార్యక్రమాలు ప్రజలందరికి తెలుసనీ ఆరోపించారు. మేము ప్యామీలీతో టూర్ వెల్లాం… దాన్ని వేరేలా వక్రికరిస్తే వారి విజ్ఞతకే వధికేస్తమన్నారు. వారి మానసిక పరిపక్వత అలా ఉంది కాబట్టే వక్రబుద్దితో ఆలోచిస్తున్నారని, మానసిక స్థితి అంతే… సరిగ్గా లేదు. బాస్ మానసిక పరిస్తితి, శిష్యుల మానసిక పరిస్తితిబాగలేదనీ ఎద్దేవా చేశారు. మేము పార్టి విడిచిన నుండి మానసిక పరిస్థితి చెడిపోయిందనీ చెప్పారు. ఈసమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

ప్రజల మద్దతుతో బిజెపి పార్టీ శ్రేణుల కృషితో గెలుపు ఖాయం: బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి):
సామాజిక సేవ చేసే వ్యక్తులు, పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తులు అందరికి ఆమోద యోగ్యమైన వ్యక్తులను నిర్ణయించడం భారతీయ జనతా పార్టీ పార్టీ గొప్పతమని, జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజీపీ పార్టీకి చెందిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లు బారి మెజార్టీ తో వజయం సాధిస్తారని బిజెపి నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని ఓ పంక్షన్ హాలులో మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతుతో, బిజెపి పార్టీ శ్రేణుల కృషితో మా అభ్యర్థులు గెలుస్తారని స్పష్టంగా అర్థమవుతుందని, పార్టీ అభ్యర్థుల ఎంపికనే విజయానికి మార్గమన్నారు. అభ్యర్థులు ఇద్దర్జు ఎలాంటి మచ్చలేని నాయకులని కితాబిచ్చారు. దీనికి అనువుగా ప్రజలు కూడ బీజేపికి మద్దతు పలుకుతున్నారనీ, కరీంనగర్ ఎంపి, పెద్దలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సజయ్ కుమార్ నాయకత్వంలో రాబోయే 20 రోజులు పార్టీ శ్రేణులమంతా ఐక్యమత్యంగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొసం బిల్లుకు మద్దతు పలికిన పార్టీ భారతీయ జనతా పార్టీఅని, ఎలాంటి ఎన్నికలు జరిగిన తెలంగాణ రాష్ట్రం లో ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారనీ చెప్పారు.
రాష్ట్రం లో గత 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేసిన చందంగా తయారైందన్నారు.
నిర్ణయాలు ప్రకటించడం తప్పా ఆ నిర్ణయాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కుంటున్న నిర్ణయాల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని లుకలుకలే తప్ప, ఒక వైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు, మరో వైపు మంత్రుల అసంతృప్తితో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్యం ఎవ్వరు డిన్నర్ మీటింగులు పెట్టవద్దని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దిగజారిందో అర్థమౌతుందని మండిపడ్డారు. ఇలాంటి పాలనపై ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనా స్పష్టంగా అర్థమవుతుందనీ గుర్తుచేశారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఒక్క సంక్షేమ పథకం అయినా సరిగ్గా ఇచ్చారా…? అని ప్రశ్నించారు. గడిచిన 14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తూ.. వస్తుందనీ, ఉచిత బస్సు పథకం మినహా ఏ సంక్షేమ పథకం ప్రజలకు సరిగ్గా అమలు కాలేదని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వ పాలన చూసి నవ్వుకుంటున్న ప్రజలు, ఆ పార్టీకి అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్తితి కనిపించడం లేదనీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అనువుగా ఉందొ ప్రజలకు తెలిపిందేనని, బడుగు బలహీనర్గాలకు అనువా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ కి ప్రజలు మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పది సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీకి అభ్యర్థిని పెట్టే పరిస్తితి లేదనీ, 70 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో గతం నుండి పనిచేస్తున్న అభ్యర్థులు దొరకని పరిస్తితి నెలకొందని చెప్పారు.కొత్త అభ్యర్థులను తెచ్చి టికెట్లు ఇచ్చుకున్న దౌర్భాగ్యు పరిస్తితి కాంగ్రెస్ పార్టీలో నెలకొందని తెలిపారు. బీజేపీ పార్టీ సంఘు ప్రచార కర్తలుగా పని చేసిన నాయకులను ప్రజా క్షేత్రంలో పోటికి దింపిందనీ ,బీజేపీ పార్టీ నిబద్దతో అభ్యర్థులను బరిలోకి దింపిందనీ. అదే మా పార్టీ గొప్పతన్నారు. అత్యధిక ఓట్లు ఉన్న జిల్లా కరీంనగర్ లో మా పార్టీ శ్రేణులమంతా కలిసి బండి సంజయ్ నాయకత్వం లో కార్యచరణ ప్రకారం ప్రతి ఓటర్ ను కలిసి మద్దతు కోరుతామని చెప్పారు.
బారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాల్సిన అవశ్యకత గురించి… ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి ఓటర్లకు అవగాహాన పరుస్తామని స్పష్టం చేశారు.
అభ్యర్థులు గెలిస్తే రాబోయే రోజుల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేయబోయే సంక్షేమాల గురించి వివరిస్తామని చెప్పారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి వివరించి మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్య క్షేత్రం ప్రతి ఓటర్ ను కలిసి మా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడుతాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో పొస్టులు పెట్టే వారికి హెచ్చరిస్తున్నా 5 సంవత్సరాల మాజీ మేయర్ పదవి కాలంలో నగరంలో ఉండి ప్రజలకు పని చేసిన చరిత్రమమధాన్నారు.
మీ నాయకుని లాగా దేశాల పర్యటన చేసే వ్యక్తినైతే కాదు. డిసెంబర్ 31, జనవరి1, 2 మీ నాయకులు ఎక్కడ ఉన్నారో మీరే ప్రశ్నించుకొవాలి. డిసెంబర్ 31 వచ్చిన పండగలు వచ్చినా ప్రజల మద్య ఉండే పనిచేశాం తప్పా! మీ నాయకుడిలా శ్రీలంకల, దుబాయ్ దేశాల్లో ఎంజాయ్ చేసే అలవాటు మాకు లేదనీ ఆరోపించారు.
మీ నాయకుడిలా ప్రతి రెండు నెలలకు ఒకసారి విదేశాలకు వెల్లి మసాజ్ లు చేస్కునే ఆలోచన మాకు లేదనీ చెప్పారు. మీ నాయకునిలా ఎవ్వరితో పడితే వారితో అసభ్యకరంగా వ్యవహరించడం మాకు రాదనీ , గతంలో వీకెండ్ మస్తీ, క్రాకర్ షోలలో మీ నాయకుడి చేసిన కార్యక్రమాలు ప్రజలందరికి తెలుసనీ ఆరోపించారు. మేము ప్యామీలీతో టూర్ వెల్లాం… దాన్ని వేరేలా వక్రికరిస్తే వారి విజ్ఞతకే వధికేస్తమన్నారు.
వారి మానసిక పరిపక్వత అలా ఉంది కాబట్టే వక్రబుద్దితో ఆలోచిస్తున్నారని, మానసిక స్థితి అంతే… సరిగ్గా లేదు. బాస్ మానసిక పరిస్తితి, శిష్యుల మానసిక పరిస్తితిబాగలేదనీ ఎద్దేవా చేశారు. మేము పార్టి విడిచిన నుండి మానసిక పరిస్థితి చెడిపోయిందనీ చెప్పారు. ఈసమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

About The Author