యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి - సీఐ డి నరేష్ కుమార్.

WhatsApp Image 2025-11-04 at 6.32.34 PM

భూపాలపల్లి : 

Read More మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వలన జరిగే అనార్థాలపట్ల యువతలో అవగాహన కల్పించడానికి భూపాలపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ సిఐ డి.నరేష్ కుమార్ మాట్లాడుతూ..  ప్రస్తుతం యువత బెట్టింగ్ ఆప్స్, ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ నేరాలు, లోన్ ఆప్స్ వంటి సైబర్ నేరాలకు  ఎక్కువ గురవుతున్నారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్ల అశ్లీల చిత్రాలు చూడటం, సోషల్ మీడియా ద్వారా ఇతరులకు పంచుకోవడం వంటి చర్యలు నేరమని, అటువంటి వాటి జోలికి ఎవరుకూడా వెళ్లవద్దని, వాటిపైన జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని, ఇదివరకు అలా చూసినవారిపైన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని , వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.  సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించు కోవాలని,  అనవసర పోస్టులు పెట్టడం, షేర్ చేయడం వంటివి చేయకూడదని, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వాటిని ఉపయోగించు కోవాలని తెలియజేశారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అదేవిధంగా మత్తు పదార్థాలు , చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని,  వాటికి బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. వ్యక్తి జీవితంలో ఇంటర్మీడియట్ అనే అతి ముఖ్యమైన దశ అని, శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులను కోరారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ బాలు నాయక్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

About The Author